బాలీవుడ్.. సౌత్ సినిమాలను ఎందుకు ఓర్వలేకపోతోంది?

by Manoj |
బాలీవుడ్.. సౌత్ సినిమాలను ఎందుకు ఓర్వలేకపోతోంది?
X

దిశ, సినిమా : ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దిశానిర్దేశం చేసిన బాలీవుడ్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని చూసి ఓర్వలేకపోతుందా? గతంలో ఇడ్లీ, సాంబార్‌గా అవహేళనకు గురై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సివ్ స్టోరీస్‌తో నార్త్‌‌ మూవీస్‌పై దక్షిణాది సినిమా చేస్తున్న దండయాత్రను ఒప్పుకోలేకపోతుందా? అంటే నిజమే అనిపిస్తోంది. కొవిడ్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రాలు థియేటర్స్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పైనా సక్సెస్ దక్కించుకుంటే.. ఇప్పటికీ రొటీన్ స్టోరీస్‌ విడిచిపెట్టని బాలీవుడ్ మాత్రం డిజాస్టర్స్‌ చవిచూసింది. ఇక ప్రేక్షకాదరణకు భాషతో సంబంధం లేదనే విషయాన్ని పలు సౌత్ సినిమాలు ప్రూవ్ చేశాయి. అయినప్పటికీ సో కాల్డ్ నార్త్ క్రిటిక్స్.. పనిగట్టుకుని మరీ సౌత్ మూవీస్‌ను టార్గెట్ చేస్తున్నారు. రిలీజ్ డే నుంచే అసత్య ప్రచారం మొదలుపెట్టడంలో ముందుంటున్నారు.

రీసెంట్‌గా ప్రభాస్ నటించిన ప్యూర్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' విషయంలోనూ ఇదే జరిగింది. 'రాధే శ్యామ్' నిజంగా కాపీ మూవీనా లేక ఒరిజినల్ స్టోరీనా వదిలేస్తే.. 'బ్యాడ్ మౌత్' కారణంగా సినిమాకు నష్టం చేకూరుతుందనేది వంద శాతం నిజం. లవ్ స్టోరీ నేపథ్యంలో ప్యూర్ అండ్ సోల్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చిన చిత్రంలో నెరేషన్ స్లోగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకుడిని ఈ కథతో కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ సక్సెస్ అయ్యారు. ప్రతీ ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ చూపిస్తూ, ఆడియన్స్‌ను ఆ కాలంలోని స్టోరీకి తీసుకెళ్లిన డైరెక్టర్.. ప్రతీ సీన్‌ను కూడా HD వాల్‌‌పేపర్‌గా మలిచాడు. అలాంటి సినిమాను డిజాస్టర్‌గా ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్..?

ఇక ఇదే టైమ్‌లో రిలీజైన బాలీవుడ్ మూవీస్ 'గంగుబాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్'కు నార్త్ క్రిటిక్స్ భారీ హైప్ ఇచ్చారు. అందులో తప్పులేదు కానీ పాన్ ఇండియా మూవీగా పోటీఇచ్చిన 'రాధే శ్యామ్'కు వన్ స్టార్ రేటింగ్‌ ఇచ్చి అవమానపరచడం ఏంటి? అనే చర్చ జనాల్లో మొదలైంది. ఇప్పుడే కాదు ఇకపై కూడా సౌత్ నుంచే పాన్ ఇండియా మూవీస్ వచ్చి బ్లాక్ బస్టర్స్‌‌గా నిలుస్తాయని.. రివ్యూస్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణతోనే బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొడతాయని అభిప్రాయపడుతున్నారు. అంతెందుకు ఇప్పటికే చాలామంది బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్న విషయం తెలిసిందే. ఐదు దక్షిణాది భాషల్లో సినిమా తీస్తే లేదా ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ సరసన నటించాలని ఉందని లేదా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులతో పనిచేస్తే చాలని ఫీల్ అవుతున్నారు. ఇక ఈ ఇద్దరు దర్శకులతో పాటు గౌతమ్ తిన్ననూరి కూడా సౌత్ సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేయగా.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సైతం తమిళ దర్శకుడు అట్లీని నమ్ముకున్న సంగతి మరిచిపోవద్దంటున్నారు. సల్మాన్ ఖాన్ సైతం వెంకీతో సినిమా చేసేందుకు సిద్ధంగా లేడా? అని ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు.

Advertisement

Next Story

Most Viewed