రూ.119 కోట్లతో 16వ అంతస్తులో ఇల్లు.. రేంజ్ చూపించిన హీరో!

by S Gopi |
రూ.119 కోట్లతో 16వ అంతస్తులో ఇల్లు.. రేంజ్ చూపించిన హీరో!
X

దిశ, సినిమా : బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన రణ్‌వీర్‌సింగ్.. తండ్రి జగ్‌జీత్‌ సుందర్‌సింగ్‌ భవ్‌నానీతో కలిసి ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. బాంద్రాలోని సాగర్‌ రేషమ్‌ బిల్డింగ్‌లోని 16వ అంతస్తులో 17 నుంచి 19వ ఫ్లోర్‌ వరకు ఉన్న ఓ ట్రిప్లెక్స్‌ కొనుగోలు చేశాడు. వీటి మొత్తం విలువ రూ.118.94 కోట్లు. 19 కార్లు పార్కింగ్ చేసుకునే వీలున్న ఈ ప్రాపర్టీ విస్తీర్ణం11266 చదరపు అడుగులు. ఆ లెక్కన చూస్తే ఒక్కో చదరపు అడుగు ధర రూ. లక్షకు పైగా ఉంటుంది. శనివారం రోజే ఈ ప్రాపర్టీ రణ్‌వీర్‌ సొంతం కాగా.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్ షారుఖ్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ఇళ్లకు దగ్గరగా ఉండటం విశేషం.

Advertisement

Next Story