- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎప్పుడు తాగాలి, ఏం చేయాలో గుర్తు చేసే స్మార్ట్ వాచ్ !
దిశ,వెబ్‌డెస్క్: బోట్ కంపెనీ మేడ్-ఇన్-ఇండియాలో భాగంగా స్మార్ట్‌వాచ్ 'బోట్ వేవ్ ప్రో 47' ను విడుదల చేసింది. దీని ధర రూ. 3,199. కొత్త స్మార్ట్‌వాచ్ ASAP చార్జింగ్, 24గంటల హెల్త్ మానిటరింగ్, ఫిట్‌నెస్ ప్లాన్‌లు, లైవ్ క్రికెట్ స్కోర్‌లు ఇతర అనేక ఫీచర్లతో వస్తుంది. స్మార్ట్ వాచ్ మూడు రంగులలో అందుబాటులో ఉంది. యాక్టివ్ బ్లాక్, డీప్ బ్లూ, పింక్.
ఇది 1.69-అంగుళాల HD డిస్‌ప్లేను, 500 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందిస్తోంది. 100+ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లతో వస్తుంది. బోయాట్ క్రెస్ట్ యాప్ ద్వారా కస్టమ్ వాచ్ ఫేస్‌ని కూడా రూపొందించుకోవచ్చు. boAt Crest యాప్ Google Play Store, Apple App Store లో అందుబాటులో ఉంది. 24-గంటల హార్ట్ రేట్ మానిటర్, టెంపరేచర్ మానిటర్, SPO2 మానిటర్ ఉన్నాయి. ఇది నడక, ట్రెడ్‌మిల్, రన్నింగ్, ఇండోర్ సైక్లింగ్, క్రికెట్, బాక్సింగ్, కరాటే, టేబుల్ టెన్నిస్, పైలేట్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ వంటి కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు.
వాచ్‌లో హైడ్రేషన్ అలర్ట్ ఫీచర్ ఉంది. ఇది రోజంతా నీరు త్రాగడానికి వినియోగదారుని గుర్తు చేస్తుంది. నీరు, దుమ్ము నిరోధకత కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. దీనిలో ఏడు రోజుల పాటు పనిచేసే బ్యాటరీ ఉందని కంపెనీ పేర్కొంది. ఇది 30 నిమిషాల్లో 0 శాతం నుండి 100 శాతానికి చార్జ్ చేయగల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.