ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |
ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరోల మూవీస్, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు కూడా నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో చాలామంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. ఇక కొత్త సినిమాలను ఓటీటీలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌(Digital Streaming)కు రెడీ అయినట్లు హాట్‌స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 12న రిలీజై ఎవరూ ఊహించనిరీతిలో ‘కిష్కింద కాండం’(Kishkindha Kaandam ) సూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రానున్నట్లు ‘X’ ద్వారా వెల్లడించారు. కాగా, ఈ మూవీలో అపర్ణ బాలమురళి(Aparna Balamurali), అసిఫ్ అలీ జంటగా నటించారు. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ. 5 కోట్ల బడ్జెట్‌తో వచ్చి ఏకంగా రూ. 50 కోట్లు వసూలు సాధించి బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో అందరి దృష్టి ‘కిష్కింద కాండం’ పై పడింది. ఇక ఒటీటీలోకి రాబోతుందని తెలుసుకున్న సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed