రేపు జాతీయ రహదారుల దిగ్బంధం

by samatah |   ( Updated:2022-04-05 16:20:39.0  )
రేపు జాతీయ రహదారుల దిగ్బంధం
X

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్ : వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సాగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం అధికార టీఆర్ఎస్ పార్టీ జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్- బెంగళూరు మధ్య ఉన్న 44వ జాతీయ రహదారి భూత్పూర్ వద్ద దిగ్బంధనం చేయనున్నారు. ఉదయము 9 గంటల నుండి నిర్వహించే ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. జిల్లా పరిషత్ చైర్మన్‌లు తదితరులు హాజరవుతున్నట్లు టీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed