- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో సీఎం అతడే: బీజేపీ
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సీఎంను మార్చనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సీఎంగా జైరాం ఠాకూర్ స్థానంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ను తీసుకోనున్నట్లు చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా, తమను ఎదుర్కోవడానికి బీజేపీ పెద్ద మార్పును చేయబోతున్నట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ స్థానంలో అనురాగ్ ఠాకూర్ ను తీసుకురానున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి మాకు సమాచారం వచ్చింది. దీనిని బట్టి అరవింద్ కేజ్రివాల్ కు పెరుగుతున్న ప్రాధాన్యానికి బీజేపీ భయపడుతుందని అర్థమవుతుంది' అని అన్నారు.
అంతేకాకుండా జైరాం ఠాకూర్ విఫల పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజల నుంచి తమ పార్టీకి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ముందు బీజేపీ ఎన్ని మార్పులు చేసినప్పటికీ, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.