జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు: బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి

by Vinod kumar |
జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు: బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి
X

దిశ, ఏపీబ్యూరో: జగన్ తన 33 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల19న కడపలో రాయలసీమ రణ భేరి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 25 వేల మందితో భారీ బహిరంగ సభ జరగనుందన్నారు. మహిళలకు,ఉద్యోగులకు, యువతకు, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు. కడప గడప నుంచి వైసీపీ మోసాలను ఎండగట్టనున్నామని అన్నారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాల్లో 49 మంది వైసీపీ అభ్యర్థులను గెలిచారన్నారు.


అందులో 8 మంది ఎంపీలు కూడా ఉన్నారని అన్నారు.మీరు గెలిచి రాయలసీమకు లాభం ఏంటని ప్రశ్నించారు. పుట్టిన గడ్డకు జగన్ ద్రోహం చేశారని ఆరోపించారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్‌‌కి ఇదే చివరి అవకాశం అవుతుందన్నారు. 2024లో బీజేపీ జనసేన కలిసి అధికారంలోకి రావడానికి సీఎం సొంత జిల్లా నుంచి శంకరావాన్ని పూరిస్తామన్నారు.

Next Story