- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో ఫాల్తుగాడున్నాడు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై బీజేపీ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. గతంలో సంచలనం రేపిన సినీ నటుల డ్రగ్స్ కేసు ఏమైందని ప్రశ్నించారు. హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయని కేటీఆరే ఫైల్ క్లోజ్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1000 మందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తా, ఇది చేస్తా - అది చేస్తా అని సీఎం కేసీఆర్ అన్నాడని, ఇజ్రాయెల్, అమెరికా నుండి టెక్నాలజీ తీసుకొస్తా అన్నాడని గుర్తుచేశారు. బంజారాహిల్స్‌లో పట్టుబడిన వారిలో కొంతమందిపైన FIR ఎందుకు నమోదు చేసి, మిగిలిన వారిని ఎందుకు వదిలి పెట్టారని అడిగారు. గోవా తర్వాత తెలంగాణ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని, దానికి టీఆర్ఎస్ నాయకులే కారణమని అన్నారు.
డ్రగ్స్ రాకెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిపారు. అంతేగాక, బీజేపీలో ఒక ఫాల్తుగాడున్నాడని, గతంలో దీనిపై బండి సంజయ్ దృష్టికి సైతం తీసుకెళ్ళానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి వల్లనే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, మా దాంట్లోనే కాదు ప్రతి పార్టీలో ఫాల్తుగాళ్లు ఉన్నారని అన్నారు. మొన్న పట్టుబడిన వారిలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారు, పోలీసు అధికారులు కొడుకులు, ఇతర వీఐపీల పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు. ''చివరగా నేను చెప్పేది ఒకటే.. డ్రగ్స్అమ్మేవారికి ఎన్కౌంటర్చేయాలి. గతంలో మీరు ఎన్కౌంటర్చేస్తే మేం సపోర్ట్చేశాం.'' అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.