- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Babu Mohan: సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు : బాబు మోహన్

దిశ, ఆమనగల్లు : BJP Leader Babu Mohan Criticizes CM KCR Over Government Schemes| దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు బాబు మోహన్ అన్నారు. మంగళవారం వితంతు, వృద్ధాప్య, వికలాంగులు, కల్లుగీత, చేనేత అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆమనగల్లు, మాడుగుల మండల కేంద్రాల్లో చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి బాబు మోహన్, ఓబీసీ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హాజరయ్యారు. అనంతరం ర్యాలీగా బయలుదేరుతూ మున్సిపల్ కమిషనర్‌కు, మండల అభివృద్ధి అధికారికి అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. అనంతరం బస్టాండ్ ఆవరణ సభలో బాబు మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనుల బిల్లులు రాక సర్పంచులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, రేషన్ కార్డు, పింఛను ఇప్పించే బాధ్యత కూడా సర్పంచులకు లేదన్నారు.
అనంతరం ఓబీసీ మాజీ సభ్యులు ఆచారి మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బస్సు ఛార్జీలు, కరెంటు చార్జీలు పెంచి పేద ప్రజలపై భారం మోపారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, ఒకప్పుడు మద్యం ద్వారా 8 వేల కోట్ల ఆదాయం వస్తే, ఇప్పుడు కేసీఆర్ హయాంలో 42 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కూలీలకు భలే గిరాకీ..!
- Tags
- Babu Mohan