కవ్వాల్ టైగర్ జోన్‌లో అందాల పక్షుల పండుగ.. ప్రకృతి ప్రేమికుల సందడి

by Web Desk |
కవ్వాల్ టైగర్ జోన్‌లో అందాల పక్షుల పండుగ.. ప్రకృతి ప్రేమికుల సందడి
X

దిశ, జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ లో అటవీశాఖ వారు నిర్వహిస్తున్న బర్డ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమై నేటితో ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 58 మంది ప్రకృతి ప్రేమికులు తరలివచ్చారు. వారందరికీ రెండు రోజులపాటు ఎఫ్‌డిఓ మాధవ రావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు వసతులు కల్పిస్తున్నారు.



శనివారం ఇందంపల్లి రేంజ్‌లోని కల్వకుంట, మైసమ్మ కుంట, దన్ చెట్టు కుంట, అదేవిధంగా జన్నారం రేంజ్‌లోని గోండు గూడా, బైసన్ కుంట, లీడ్ గాయి కుండలకు టూరిస్టులు రెండు గ్రూపులుగా విభజించి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మధ్యాహ్నం దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు.


అక్కడికి వెళ్ళినా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రకృతి ప్రేమికులు తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో రక రకాల పక్షులను వారి కెమెరాల్లో బంధించారు. అడవిలో ఉండే పలు రకాల పక్షులు, జంతువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.



మొదటి రోజు శనివారం రాత్రి అడవిలోనే భోజన సౌకర్యం తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో దట్టమైన అడవిలో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఉదయం దాదాపు నాలుగు గంటల సమయంలో వివిధ జాతుల పక్షులను కెమెరాల్లో బంధించారు.

Advertisement

Next Story

Most Viewed