Elon Musk: హాయిగా నిద్ర‌పోడానికి ఎల‌న్ మ‌స్క్ చెప్పిన సూప‌ర్ టిప్!

by Sumithra |   ( Updated:2022-07-14 12:52:25.0  )
Elon Musk Shares Tips For Better Sleep with his Social Media Follower
X

దిశ‌, వెబ్‌డెస్క్ః Elon Musk Shares Tips For Better Sleep with his Social Media Follower| ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) అంటేనే సంచ‌ల‌న‌నానికి మారుపేరు. ఇటీవ‌ల‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ప్రతిపాదించి, త‌ర్వాత‌ అకస్మాత్తుగా ఒప్పందం నుండి వైదొలిగినందుకు చాలా కాలంగా వార్తల్లో వేగుతున్నాడు. అయితే, ఇప్పుడు దానికి భిన్నంగా హెల్త్‌కు సంబంధించిన విష‌యంలో హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఇటీవల, ఎలన్ మస్క్ తన సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ కోసం ఒక టిప్ ఇచ్చాడు. హాయిగా నిద్ర‌పోవడానికి సులువైన రహస్యాన్ని చెప్పాడు. నిద్ర అనేది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఒకరి ప‌నిత‌నాన్ని, ఉత్పాదకతను కూడా మెరుగుప‌రుస్తుంద‌ని తెలిపాడు. ఇక ఈ టిప్‌లో.. నిద్రించే మంచం తల వైపు 3-5 సెంటీమీటర్ల వరకు పెంచడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంద‌ని అన్నాడు. ఇంకా, నిద్రించడానికి మూడు గంటల ముందు ఏదీ తినకూడదని కోరాడు. "మెరుగైన నిద్ర నాణ్యత కోసం, మీ మంచం తలని 3 లేదా 5 సెం.మీ మేర పైకి లేపండి. అలాగే, నిద్రవేళకు 3 గంటల ముందు తినవద్దు" అని మస్క్ సలహా ఇచ్చాడు. తర్వాత, మ‌రో ట్వీట్‌లో 'నిద్రపోయే మూడు గంటల ముందు ఏమీ తినకూడదనే ఆచారాన్ని భారతీయులు శతాబ్దాలుగా అనుసరిస్తున్నారని' పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్ల‌పై నెటిజ‌నులు కామెంట్లు కురిపిస్తున్నారు.

Also Read: వేల‌ల్లో శవాల గుట్ట‌లు.. చరిత్ర‌లో అత్యంత దారుణ ఘ‌ట‌న‌!

Advertisement

Next Story

Most Viewed