Sonia Akula Engagement: ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-11-23 07:31:08.0  )
Sonia Akula Engagement: ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-8 లో పాల్గొన్న ఆకుల సోనియా(Akula Sonia) గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ హౌస్‌లో ఉన్నన్నీ డేస్ బాగానే ఆడింది. తన ఆటతో పాటతో ప్రేక్షకుల్ని బాగానే మెప్పించింది. ముఖ్యంగా చిన్నోడు, పెద్దోడు అంటూ హౌస్‌లో నడిపిన లవ్ ట్రాక్ బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కానీ సోనియా హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. కొన్నిడేస్‌కు బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేశాడు. ఇక బయటకెళ్లాక పలు ఇంటర్వ్యూకు హాజరైన సోనియా తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి ఒక్కసారిగా షాకిచ్చింది. తాజాగా ఆయనతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం(Engagement) చేసుకుని మరో బిగ్ షాకిచ్చింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సోనియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నెల (నవంబరు) 21 గురువారం రోజు సోనియా నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఇక యష్(Yash), సోనియాలకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. బిగ్ బాస్ కు వెళ్లకుండ ఉంటే ఇప్పటికే వీరి వివాహం జరుగుతుండేనని సోనియా తల్లిదండ్రులు ఓ వీడియో ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. కాగా వచ్చే నెల డిసెంబర్ నెలలో వీరి పెళ్లి జరగబోతుందని నెట్టింట టాక్ వినిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సోనియా ఎంగేజ్‌మెంట్స్ పిక్స్ వీక్షించిన జనాలు.. నిజంగానే సోనియా నిశ్చితార్థం చేసుకుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story