- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాడి కౌశిక్ రెడ్డికి అనూహ్య షాక్.. ఆ నేతలంతా రహస్య భేటీ (వీడియో)
దిశ ప్రతినిధి, వరంగల్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని అంతర్భాగ మండలమైన కమలాపూర్ టీఆర్ఎస్‌లో ముసలం పుట్టింది. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వెంట తెచ్చుకున్న కాంగ్రెస్ నేతలకే నియోజకవర్గ పార్టీలో ప్రాధాన్యం కల్పించడంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా వారికే దక్కేలా చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కౌశిక్‌రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నేరుగా ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించుకోవడం గమనార్హం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూరు పల్లి - బావుపేటల మధ్య ఉన్న ఆర్ఎంఆర్ గార్డెన్‌లో కమలాపూర్ టీఆర్ఎస్‌కు చెందిన కొంతమంది కీలక నేతలు, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు రహస్యంగా సమావేశం కావడం విశేషం. ఈ సమావేశంలో నేతలు మూకుమ్మడిగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై వ్యతిరేకతను వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోలు కూడా దిశకు చిక్కాయి. ఈ వీడియోల్లో కౌశిక్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అసలు నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ఎవరు..?
హుజరాబాద్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ యాదవా..? లేక కౌశిక్ రెడ్డినే అంతనా..? అంటూ కొంతమంది నేతలు ప్రశ్నిస్తూనే ఆయన వైఖరిపై ఆగ్రహావేశాలను ప్రదర్శించినట్లు సమాచారం. ఇటీవల కొన్ని నామినేటెడ్ పదవులకు కాంగ్రెస్, టీడీపీ నుంచి కొత్తగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట దేవాదాయ కమిటీలో మండలం నుంచి ఒక్క నేతకు కూడా అవకాశం దక్కలేదని, అదే సమయంలో కౌశిక్‌రెడ్డి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన అనుచరులుగా చెలామణి అవుతున్న వారికే మొత్తం పదవులు దక్కాయని గుర్తు చేసినట్లు సమాచారం. రానున్న నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన వర్గం పేర్లే వినిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్ నేతల సేవలకు విలువ ఉంటుందన్న నమ్మకం కుదరడం లేదంటూ కొంతమంది నేతలు కుండబద్ధలు కొట్టినట్లుగానే సమావేశంలో మాట్లాడంటం గమనార్హం.
మనం ప్రియారిటీ కాదా..?
నియోజకవర్గంలోని కమలాపూర్ మండల పార్టీ నేతలు కౌశిక్‌రెడ్డికి చివరి ప్రాధాన్యంగా నిలుస్తున్నారంటూ కొంతమంది నేతలు సమావేశంలో ధ్వజమెత్తినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి తప్ప మిగతా అన్ని మండలాల నాయకులకు మొదటి ప్రాధాన్యత ఉంటోందని, పదవులు దక్కుతున్న వారిలో కౌశిక్ రెడ్డి వర్గానికే మొదటి స్థానం ఉంటోందని నాయకులు సమావేశంలో వాపోయారు. ఇన్ని సంవత్సరాలు పార్టీకి, ఈటల రాజేందర్ కు మద్దతు తెలుపుతూ పనిచేశామని, ఈటల రాజేందర్ పార్టీని వీడినా తాము మాత్రం పార్టీ ఆదేశాలకే కట్టుబడి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపునకు కృషి చేశామని కొంతమంది నేతలు ఉద్వేగంగా మాట్లాడినట్లు సమాచారం. అయితే ఆఖరి నిమిషంలో వచ్చిన కౌశిక్‌రెడ్డి వెంట తెచ్చుకున్న నేతలకే పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవులు దక్కేలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ ఎల్లప్పుడూ వారికి సహాయ, సహకారాలు అందిస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం వేరే పార్టీ నుండి పార్టీలోకి వచ్చిన కొత్త వారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- Tags
- TRS
- Padi kaushik