- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భట్టి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్.. రీజన్ ఇదే
by S Gopi |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీతో ఈ నెల 4న అత్యవసర సమావేశం ఉన్నందున ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి లేఖ రావడంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను వాయిదా వేసుకుని ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ కారణంగా బోనకల్లు మండలంలో నిర్వహించే పాదయాత్రను ఆదివారం నుంచి వాయిదా వేశారు. ఏఐసీసీ అధిష్టానంతో సమావేశం ముగించుకున్న తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్ కు చేరుకొని సీఎల్పీ నేత తన పాదయాత్రను కొనసాగిస్తారు.
Next Story