కాస్త సమయం ఇవ్వండి.. పంజాబ్ ప్రజలను కోరిన సీఎం

by Harish |
కాస్త సమయం ఇవ్వండి.. పంజాబ్ ప్రజలను కోరిన సీఎం
X

చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రజల సమస్యలను నెరవేర్చేందుకు తనకు సమయం కావాలని అన్నారు. ఈ మేరకు సోమవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'పంజాబ్ ప్రజలారా, కాస్త సమయం ఇవ్వండి. కాస్త ఓపిక వహించండి. నాకు గుర్తు లేని విషయం ఒక్కటి కూడా లేదు' అని పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని వైబ్రెంట్ పంజాబ్‌గా మార్చడంలో తొందరపడద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని సమస్యలు తొలగిస్తానని, కాస్త సమయం ఇవ్వాలని కోరారు. కాగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు 92 సీట్లలో గెలుపొంది, ఆప్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఉచిత కరెంట్, మహిళలకు ప్రతి నెలా రూ.1000 హామీలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో ఆప్ అధికారంలోకి రావడంతో హామీలు నెరవేర్చాలని విపక్షాలు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి.

Advertisement

Next Story