కలలో రామ చిలుక కనిపిస్తుందా.. అయితే ఇదే జరుగుతుందటా ?

by samatah |   ( Updated:2022-05-04 10:56:45.0  )
కలలో రామ చిలుక కనిపిస్తుందా.. అయితే ఇదే జరుగుతుందటా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కల.. అది ఒక అందమైన ప్రపంచం. అయితే చాలా మందికి కలలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ కొంత మందికి మాత్రమే కలలు మార్నింగ్ వరకు గుర్తుంటాయి. ఇక కొందరైతే డ్రీమ్స్‌లో తేలిపోతూ ఉంటారు. కానీ కల వచ్చినప్పుడు ఒక్కోసారి, పాములు, పక్షులు, మన కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. అయితే కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే శుభం, కొన్ని వస్తువులు లేదా పక్షులు కనిపిస్తే అశుభం అని కొందరు అంటూ ఉంటారు. అయితే కలలో రామ చిలక కనిపిస్తే.. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది తెలుసుకుందాం.

రామ చిలుకను ఇష్టపడని వారు ఉండరు. ఇక సామన్యంగా చిలుకలు కలలో తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలో చిలుక కనిపిస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు. కలలో గనుక రామ చిలుక కనిపిస్తే ఆ కుటుంబంలో ఆనందం నెలకొటుందంట, అంతే కాకుండా వారి కుటుంబంలో ఆకస్మిక ధన లాభం, వృద్ధి, వివాహం, సంతానప్రాప్తి కలుగుతాయట. అందువలన కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచికమే.

Advertisement

Next Story