- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Basara IIIT లో టెన్షన్ టెన్షన్.. 300 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: Basara IIIT Students Hospitalized Due to Food Poisoning| నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు విద్యార్థులు ఎగ్ కర్రీ రైస్ భోజనం చేయగా.. కలుషిత ఆహారం తినడంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. అస్వస్థకు గురైన వారికి అంబులెన్స్‌తో పాటు ఫ్యాకల్టీ కార్లలో త్రిబుల్ ఐటీలోని ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
విషయం బయటకు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. త్రిబుల్ ఐటీ లోపల బయట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విపక్షాల నాయకులు వచ్చే అవకాశం ఉందని తెలియడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు విద్యార్థుల పరామర్శించేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌ని లోపలికి పోలీసులు అనుమతించ లేదు. దీంతో ఆయన త్రిబుల్ ఐటీ గేటు ముందు నిలుచున్నారు. విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: గోదావరిలో కలిసిపోయిన భద్రాచలం (ఫొటోలు)
- Tags
- Basara IIIT