- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana News: 'కేసీఆర్ కుటుంబ సభ్యుడికి రాష్ట్రంలో 112 వైన్‌షాపులు ఉన్నాయి'
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వరుస డ్రగ్స్ కేసుల సంచలనం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్‌పై దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు బయటపడిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డ కావడానికి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. డ్రగ్స్ దందాపై తీసిన "ఉడ్తా" పంజాబ్ సినిమా మాదిరిగా.. ఉడ్తా హైదరాబాద్ సినిమా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కువ డ్రగ్స్ కేసులు నమోదైనా.. ఒక్క కేసును కూడా పూర్తిగా విచారించకుండా పక్కదోవ పట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యుడికి 112 వైన్స్ షాపులున్నాయని చెప్పారు. డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని, డ్రగ్స్ కేసు వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసినా కేసీఆర్ స్పందించలేదన్నారు.