- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ సీఎం ధర్నా చేయొచ్చు.. మేం దీక్ష చేస్తే తప్పా..? బండి సంజయ్‌ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద గురువారం చేపట్టనునన్న 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ఫైరయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ధర్నా చేయొచ్చు.. కానీ బీజేపీ దీక్ష చేపడతానంటేనే అన్ని అడ్డంకులొస్తాయా? ఇదెక్కడి న్యాయమంటూ బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.
ఇందిరాపార్క్‌ను ధర్నా చౌక్‌గా పునరుద్ధరించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయని, అలాంటిది తమకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యం గొంతు నులిపేసే కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష'ను యథాతథంగా కొనసాగిస్తామని బండి సంజయ్స్పష్టం చేశారు.