- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రిలో అనూహ్య ఘటన.. ఈవో గీతాపై స్థానికుల ఫైర్
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి కొండపైకి ప్రైవేట్ వాహనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో గీత ప్రకటించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. యాదగిరి గుట్టకు సంబంధించిన ఆటో, కారు డ్రైవర్స్ శుక్రవారం యాదాద్రిలో మెరుపు ధర్నాకు దిగారు. సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు రోడ్డుపై ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా తాము గుట్టపైకి ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నామని.. ఇప్పుడు ఉన్నపళంగా నిషేధం విధిస్తే తమ కుటుంబాలు ఏం కావాలని ప్రశ్నించారు. ఆలయ ఈవో గీత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమ పొట్టకొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రైవేట్ వాహనాలను గుట్టపైకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఈవో నిర్ణయంతో 400 కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన ఈవోని ఇంకా విధుల్లో కొనసాగిస్తున్నారని, వెంటనే ఆమెను బాధ్యతల నుంచి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆటోలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ యాదగిరి గుట్ట తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కెర్ల సతీష్, పేలిమెల్లి శ్రీధర్ గౌడ్, తాళ్ల లక్ష్మ రెడ్డి, ధార నవీన్, మధు,అనిల్, లింగం యాదవ్, ఆటో యూనియన్ నాయకుడు మధుగౌడ్, బబ్బూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.