అమానుషం.. హిందూ కుటుంబంపై పాకిస్తాన్‌లో దాడి (వీడియో)

by sudharani |
అమానుషం.. హిందూ కుటుంబంపై పాకిస్తాన్‌లో దాడి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో రోజురోజుకూ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. గతంలో పాకిస్తాన్‌లో హిందువుల సంఖ్య 10 శాతం కంటే ఎక్కువగా ఉండేది. కాలక్రమేనా ఇది 1-2 శాతానికి పడిపోయింది. అయితే మెజారిటీ వర్గం వేధించడం వల్ల చాలా మంది బలవంతంగా మతం మరారు. కొన్ని సందర్భాలలో హిందూ మహిళలను బలవంతపు పెళ్లిళ్లు చేసుకుని మతాలు మార్పించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో చాలా ప్రాంతాల్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి చిన్న కారణానికే హిందూ కుటుంబంపై దాడికి దిగాడు. హైవేపై వెళ్తున్న క్రమంలో మంత్రి బంధువు షంషేర్ పిటాఫీ వాహనాన్ని హిందూ కుటుంబం ఓవర్ టేక్ చేసింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ రేపర్‌ను బయటకు విసిరేశాడు. ఇది మంత్రి బంధువు వాహనం విండ్ షీల్డ్‌కు తగిలింది. దీంతో ఆగ్రహించిన పిటాఫీ తన గార్డులతో హిందూ కుటుంబంపై దాడికి పాల్పడ్బాడు. ఆ సమయంలో కారులో చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పిటాఫీ వీరిపై అనుచింతంగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story