ఆరోగ్యం నయం చేస్తానన్న భూతవైద్యుడు.. చివరకు ఏమైదంటే?

by samatah |   ( Updated:2022-04-06 06:18:31.0  )
ఆరోగ్యం నయం చేస్తానన్న భూతవైద్యుడు.. చివరకు ఏమైదంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందుతూ వస్తున్నా.. కొంత మంది మూఢనమ్మకాల మాయలోనే ఉంటున్నారు. క్షుద్ర పూజలతోనే అన్ని సమస్యలు తిరిపోతాయనే నమ్మకం కొందరిలో బలంగా నాటుక పోయింది. ఇలాంటి ఓ ఘటనే జార్ఘండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. జార్ఖండ్‌‌లోని చాత్రా జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలికకు గత కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించింది. కాగా బాలిక తల్లిదండ్రులు అరోగ్యం మెరుగు పడడం లేదని భూతవైద్యుడి దగ్గరకు వెళ్లారు. మౌలానా వాహిద్ అనే భూతవైద్యుడికి చూపించగా తాను బాలికకు దెయ్యం పట్టిందని, నయం కావలంటే నేను చెప్పినట్లు చెయ్యాలని వారితో చెప్పాడు. నాలుగు రోజుల్లో దెయ్యన్ని వదిలిస్తా అని క్షుద్రపూజల పేరుతో బాలికను చిత్ర హింసలకు గురిచేశాడు. అంతేకాక ఈ క్రమంలోనే దారుణంగా కొట్టి, కాల్చి వాతలు పెట్టడంతో అనారోగ్యం మరింత క్షీణించింది. గాయాల చికిత్స కోసం ఆస్పత్రిలలో చేర్పించారు. భూతవైద్యుడు తీవ్రంగా కోట్టడంతో మతిస్థిమితం కోల్పోవడాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేసి భూతవైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed