- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
50 ఏళ్ల సరిహద్దు వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు
న్యూఢిల్లీ: యాభై ఏళ్ల సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయాలు ముగింపు పలికాయి. దీనికి గానూ ఇరు రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వ శర్మ, కన్రాడ్ సంగ్మాలు ఒప్పందంపై సంతకం చేశారు. మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఇద్దరు నేతలు ఒప్పందం చేసుకున్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ ఇదో చారిత్రక రోజు అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి పునరుద్ధరణ, సంస్కృతి, పురోగతి దిశగా ప్రధాని మోడీకే ఘనత దక్కిందని అన్నారు. దీంతో 1972 నుంచి ఉన్న 884 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉన్న 12 ప్రాంతాల్లోని ఆరు చోట్ల సుధీర్ఘ వివాదానికి పరిష్కారం లభించనుంది. ఈ ఒప్పందంతో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో 70 శాతం పరిష్కారమైనట్లేనని అన్నారు.
దీనిపై మేఘాలయ సీఎం స్పందిస్తూ అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. 'నేడు(మంగళవారం) మొదటి దశ తీర్మానం జరిగింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వల్లే ఇది సాధ్యమైంది' అని చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ముందుండి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారని అన్నారు. కాగా, 36.79 కిలోమీటర్ల సరిహద్దు వివాదానికి.. అసోం 18.51 చదరపు కిలోమీటర్లు, 18.28 చదరపు కిలోమీటర్లు మేఘాలయ ఇచ్చేలా సిఫార్సు చేశారు.