- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కల్లోనూ నొప్పి నివారిణిగా 'ఆస్పిరిన్' ..
దిశ, ఫీచర్స్ : తలనొప్పి నివారణకు మనుషులు 'ఆస్పిరిన్' తీసుకున్నట్లే.. మొక్కలు ఒత్తిడిని అధిగమించేందుకు 'సాలిసిలిక్ యాసిడ్' ఔషధాన్ని కలిగి ఉంటాయి. కరువు, వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఈ కర్బన సమ్మేళనం సహజంగా ఉత్పత్తవుతుందని, గ్లోబల్ వార్మింగ్ నుంచి పంటలను రక్షించేందుకు ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చని కొత్త అధ్యయనం వివరించింది.
సాలిసిలిక్ యాసిడ్ సహజంగా మొక్కల్లో ఏర్పడుతుంది. వాస్తవానికి ఆస్పిరిన్ మెడిసిన్ రాకముందు మనుషులు నొప్పి నివారణ కోసం ఈ సింథటిక్ ఔషధాన్నే ఉపయోగించేవాళ్లు. పురాతన ఈజిప్షియన్లు విల్లో చెట్ల ఆకులు, బెరడుతో తయారుచేసుకున్న సాలిసిలిక్ యాసిడ్ ద్వారా కీళ్ల నొప్పులు, జ్వరాల నుంచి ఉపశమనం పొందేవారు. ఇదిలా ఉంటే.. మొక్కల్లో ఈ యాసిడ్‌ను ఉత్పత్తిని అర్థం చేసుకునేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఓ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. పర్యావరణ ఒత్తిడికి ప్రతిస్పందనగా అన్ని జీవులు 'రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెయస్'(ROS)'గా పిలవడే రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మానవ చర్మం కూడా తీవ్రమైన సూర్యరశ్మి ప్రభావంతో అధిక స్థాయిలో 'ఆర్‌వోఎస్'ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ఫలితంగా మచ్చలు ఏర్పడటం లేదా వడదెబ్బకు గురవచ్చు. ప్రాణాంతకం కాని ఈ ROS పరిమిత(సురక్షిత) స్థాయిన మొక్కల్లో సాలిసిలిక్ యాసిడ్ వంటి రక్షిత హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
పరిశోధన :
'అరబిడోప్సిస్' మోడల్ ప్లాంట్‌పై పరిశోధకులు పలు ప్రయోగాలు నిర్వహించారు. మొక్క కణాలు 'MEcPP' అనే అలారం అణువును ఉత్పత్తి చేసేందుకు వేడి, అధిక సూర్యరశ్మి, కరువు పరిస్థితులే కారణమని కనుగొన్నారు. ఈ అణువు సాలిసిలిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ జరిగే క్లోరోప్లాస్ట్‌లను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు పంటలకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణంలోని ఇతరత్రా అంశాలకు కూడా ఈ ప్రయోజనాలను విస్తరించే వీలుంది.
'వాతావరణ మార్పులతో మరింత ప్రబలంగా మారుతున్న ఒత్తిళ్లను తట్టుకునేందుకు మొక్కలకు సాలిసిలిక్ యాసిడ్ దోహదపడుతుంది. కాబట్టి ఈ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే మొక్కల సామర్థ్యాన్ని పెంచడమంటే.. రోజువారీ జీవితంలో వాతావరణ మార్పుల ప్రభావాలను సవాల్ చేయడంలో ఓ ముందడుగు పడినట్లేనని సీనియర్ సైంటిస్ట్ కటయూన్ దేహెష్ వెల్లడించారు.