పార్టీలో మందేసిన షారుఖ్ కొడుకు.. మళ్లీ జల్సాలు మొదలెట్టాడా..?

by Nagaya |
పార్టీలో మందేసిన షారుఖ్ కొడుకు.. మళ్లీ జల్సాలు మొదలెట్టాడా..?
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే హాట్ టాపిక్ అయిపోతున్నాడు. ఈ మధ్యే డ్రగ్స్ కేసు నుంచి క్లీన్ చీట్ అందుకున్న ఆర్యన్.. తాజాగా పబ్‌లో ఆల్కహాల్ తీసుకోవడంపై దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. 'ఆర్యన్ ఖాన్ మళ్లీ తన రిచ్ లైఫ్ స్టైల్‌కు వచ్చేశాడు. డబ్బు, పవర్ ప్లే న్యాయాన్ని కొనేస్తుంది. అందుకే ఈ నిందితుడు మళ్లీ జల్సా చేస్తున్నాడు' అని తిట్టిపోస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో ఆర్యన్‌కు సపోర్ట్‌‌గా నిలిచిన ఫ్యాన్స్.. ఈ దేశంలో ఆల్కహాల్ సేవించడం కూడా నేరమేనా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ స్టార్ కిడ్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అంటూ.. పార్టీలో మందు తీసుకున్నాక మాస్క్ వేసుకున్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పదే పదే గతాన్ని గుర్తుచేస్తూ చేయని తప్పుకు నేరస్తుడిగా ముద్రవేయకూడదని సూచిస్తున్నారు.

v

Advertisement

Next Story

Most Viewed