- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నానం చేసినా చెమట వాసన వస్తుందా? అలా ఎందుకంటే?
దిశ, ఫీచర్స్ : మనుషులు అన్నాక చెమట పట్టడం కామన్. శారీరక శ్రమ, రద్దీ వాహనాల్లో ప్రయాణం లేదా ఉక్కపోత వాతావరణం వంటి అనేక అంశాలు ఇందుకు కారణం కావచ్చు. నిజానికి చెమటకు వాసన ఉండనందున కొందరికి చెమటపట్టినా వారి శరీరం నుంచి ఎటువంటి దుర్వాసన వెలువడదు. కానీ చర్మంపైనున్న బ్యాక్టీరియా ద్వారా చెమట విచ్ఛిన్నమైనపుడు అది వాసనగా మారుతుంది. చాలామంది దీర్ఘకాలికంగా ఇలాంటి అసహ్యకరమైన శరీర వాసనతో బాధపడుతుంటారు. సాధారణంగా ఒంటికి లేదా బాత్ టబ్స్‌లో పెర్‌ఫ్యూమ్స్ వేసుకుంటే మంచి వాసన ఇస్తుంది. కానీ స్నానం చేసిన తర్వాత కూడా శరీర దుర్వాసన వెంటాడుతుంటే మాత్రం అందుకు గల కారణాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఆ విశేషాలను మంగళూరుకు చెందిన ప్రముఖ కన్సల్టెంట్-డెర్మటాలజీ డాక్టర్ ప్రమోద్ కుమార్ వివరించారు.
శరీర వాసన అనేది ఒక వ్యక్తి శరీరం నుండి వెలువడే వివిధ రకాల వాసనలకు విస్తృత పదం. శరీరం సాధారణ శారీరక విధులకు అవసరమైన అనేక పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పదార్థాలు అధికంగా ఉన్నప్పుడు లేదా బాహ్య మూలాల ద్వారా పనిచేసినప్పుడు దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గల ప్రధాన కారణాలు :
* హార్మోన్స్ :
విపరీతమైన చెమట, తద్వారా శరీర దుర్వాసన అనేది హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల సంభవించవచ్చు. డాక్టర్ కుమార్ ప్రకారం 'యుక్తవయస్సు, ప్రెగ్నెన్సీ, ప్రీమెనోపాజల్, రుతుక్రమం ఆగిపోయిన దశలో హార్మోన్స్, చెమట గ్రంథి కార్యకలాపాలు పెరగడం వల్ల శరీర నుంచి ఎక్కువ దుర్వాసన రావడాన్ని గమనించవచ్చు. ఈ దశలో మహిళలు వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు అనుభవిస్తారు. ఇది చెమట, దుర్వాసనను పెంచుతుంది.
* కొన్ని వ్యాధులు :
అధిక చెమటకు సంబంధించిన ఏదేని కారణం శరీర దుర్వాసన సంభావ్యతను పెంచుతుంది. మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, మూత్రపిండ వ్యాధులు, కాలేయ వ్యాధులు, అంటు వ్యాధులు, గౌట్ వంటి కొన్ని వైద్య పరిస్థితులు, వ్యాధుల వల్ల కూడా చెమటలు పట్టవచ్చు. ఇవి శరీర దుర్వాసనను పెంచుతాయి. కాబట్టి శరీర వాసనలో అకస్మాత్తుగా మార్పు గమనిస్తే ఈ వ్యాధుల ఇతర లక్షణాలను తనిఖీ చేసి వైద్యుడిని సంప్రదించాలి.
* మసాలా ఫుడ్స్ :
మసాలా ఆహారాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్, కెఫిన్ అధికంగా తీసుకోవడం చెమట దుర్వాసనకు కారణమవుతుంది. నిజానికి, ప్రోటీన్ వినియోగం పెరగడం వల్ల కూడా శరీర దుర్వాసన పెరుగుతుంది.
* ఒత్తిడి:
ఆత్రుత, ఆందోళన లేదా ఒత్తిడికి గురయ్యే వ్యక్తుల్లో శరీర దుర్వాసన సర్వసాధారణం. ఇలాంటి వారు వింత వాసన అనుభవాన్ని ఎదుర్కొంటుంటే వారి శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతుందని అర్థం.
* ఇతర కారణాలు:
పై కారకాలతో పాటు వేడి వాతావరణం, కఠినమైన వర్కవుట్స్, రెగ్యులగా ఆల్కహాల్ వినియోగం, లోదుస్తులను క్రమం తప్పకుండా మార్చుకోకపోవడం, సింథటిక్ దుస్తులు ధరించడంతో పాటు చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవడం వంటివి శరీర దుర్వాసనకు దోహదం చేస్తాయి.
దుర్వాసన వదిలించుకునే చిట్కాలు :
1. శరీర దుర్వాసనలో శారీరక పరిశుభ్రతది ముఖ్య పాత్ర. అందుకే శరీరాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచేందుకు ప్రతిరోజూ యాంటీ బాక్టీరియల్ సబ్బుతో స్నానం చేయాలి.
2. చంకలు, గజ్జలు వంటి ప్రైవేట్ పార్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ ప్రాంతాల్లో షేవింగ్ చేయడం వల్ల చెమట వేగంగా ఆవిరైపోయి బ్యాక్టీరియా చర్యను నివారిస్తుంది.
3. సింథటిక్ దుస్తులు చెమటను సరిగ్గా ఆవిరవకుండా చేసి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దుర్వాసన రాకూడదంటే ఇలాంటి దుస్తులు ధరించవద్దు.
4. యాంటీపెర్‌స్పిరెంట్స్, డియోడరెంట్లు శరీరంపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తాయి. చెమట గ్రంథులను నిరోధించడం ద్వారా చెమటను తగ్గిస్తాయి. కాబట్టి శరీర దుర్వాసన ఎదుర్కొంటున్న వ్యక్తులు వీటిని రోజుకు రెండుసార్లు ఉపయోగించాలి.
5. రెగ్యులర్‌గా ఉతికిన దుస్తులే ధరించాలి. అలాగే బట్టలపై డిటర్జెంట్లు, సబ్బుల అవశేషాలు లేకుండా చూసుకోవాలి.