- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రతిరోజూ నాన్‌వెజ్ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి?

దిశ, వెబ్‌డెస్క్: నాన్ వెజ్ (non veg) ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆదివారం వస్తే చాలు అందరి ఇళ్లలో తప్పక చికెన్ లేదా మటన్ కర్రీ వాసన గుమగుమలాడాల్సిందే. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే చికెన్ కర్రీ తింటే మరికొంతమంది మాత్రం వారానికి నాలుగు, ఐదు సార్లు చికెన్ తింటుంటారు. ఇక మరికొంతమంది అయితే ప్రతిరోజూ నాన్ వెజ్ తినే వారు ఉంటారు.
అయితే ప్రతిరోజూ నాన్ వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. నాన్ వెజ్ తినడం గురించి ఆరోగ్య నిపుణులు సూచించేది ఏమిటంటే.. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నాన్ వెజ్ తినడం వల్ల ఓ వైపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కండరాలు పెరుగుతాయి, ఎముకలు బలంగా (Bones strong) ఉంటాయి, రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం (mental health) మెరుగుపడుతుందని అంటున్నారు.
నాన్ వెజ్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. నాన్ వెజ్ తినడం వల్ల కలిగే సమస్యలు చూసినట్లైతే.. అయితే మాంసాహారంలో సంతృప్త కొవ్వులు (Saturated fats) అధికంగా ఉంటాయి. కాగా ఇవి గుండె జబ్బుల (Heart disease)ప్రమాదాన్ని పెంచడానికి ప్రోత్సహిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు (Digestive problems) తలెత్తుతాయి. రెడ్ మీట్ తినడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కాగా నాన్ వెజ్ కూడా పరిమితిలో తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం జీర్ణం కావడం కూడా చాలా ఆలస్యం అవుతుంద. అలాగే మలబద్ధకం, గ్యాస్, అజీర్తికి దారితీస్తుంది. ప్రతిరోజూ నాన్ వెజ్ తింటే హార్మోన్ల అసమతుల్య కూడా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా హెల్త్ ఇష్యుస్ వస్తాయి. వీటితో పాటుగా కిడ్నీ (Kidney)లపై ప్రభావం పడుతుంది. వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాగా కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాలేయంపై ఒత్తిడి పెరిగి ఎన్నో ప్రాబ్లమ్స్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.