కేజ్రీవాల్ మీడియా ద్వారానే సంచలనం సృష్టిస్తారు.. కేంద్ర మంత్రి

by Vinod kumar |
కేజ్రీవాల్ మీడియా ద్వారానే సంచలనం సృష్టిస్తారు.. కేంద్ర మంత్రి
X

చండీగఢ్: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మోడీపై గెలుపొందలేరని అన్నారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని నొక్కి చెప్పారు. గతంలో ప్రధాని మోదీపై కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ అత్యంత ఆదరణ కలిగిన నాయకుడని అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్ని ఎన్నికలు జరిగిన ఆయన పేరు మీద ఏకపక్షంగా ఓట్లు పడుతాయని చెప్పారు.


ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని ఉద్ఘాటించారు. 'కేజ్రీవాల్ మోదీపై గతంలో పోటీ చేశారు. పరిస్థితి ఏంటో మీరు చూశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక్క సీటు గెలవలేదు. ఉత్తరాఖండ్, గోవాలలో పరిస్థితి కూడా చూశారు' అని అన్నారు. మీడియా ద్వారా కొన్నిసార్లు వారు సృష్టించాలని ప్రయత్నించిన, క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. కాగా, వారణాసిలో మోదీపై కేజ్రీవాల్ పోటీ చేయగా కేవలం రెండు లక్షల ఓట్లు మాత్రమే సాధించారు.

Advertisement

Next Story

Most Viewed