యవ్వనం కరిగిపోకుండా రీసెర్చ్.. ప్రయోగాల్లో పాజిటివ్ రిజల్ట్స్

by Javid Pasha |
యవ్వనం కరిగిపోకుండా రీసెర్చ్.. ప్రయోగాల్లో పాజిటివ్ రిజల్ట్స్
X

దిశ, ఫీచర్స్ : జీవుల వృద్ధాప్య ప్రక్రియను శాస్త్రీయంగా తిప్పికొట్టాలనే లక్ష్యంతో ఎలుకలపై చేపట్టిన US-ఆధారిత అధ్యయనం సానుకూల ఫలితాలను నమోదు చేసింది. వృద్ధాప్యం మూలంగా అవయవాల పనితీరులో మందగింపు, అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరగనుండగా.. ఈ లక్షణాలు జీవి కణాల్లో ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే వృద్ధాప్యం దీర్ఘకాలిక బాహ్య జన్యు మార్పులకు దారితీస్తుంది. అందువల్లే వృద్ధ జీవుల DNA.. తక్కువ వయసున్న వారి కంటే భిన్నమైన కెమికల్ ప్యాటర్న్స్ చూపుతుంది. ఈ మార్పులను నిరోధించగలిగితే లేదా తిప్పికొట్టినట్లయితే జీవితాన్ని పొడిగించేందుకు, ఆరోగ్యకరమైన వృద్ధాప్య ప్రక్రియను కొనసాగించేందుకు.. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిణామాలకు చికిత్స చేసేందుకు మార్గాలను కనుగొనవచ్చు.

యునైటెడ్ స్టేట్స్‌లోని సాల్క్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎలుకలపై జన్యు థెరపీ ద్వారా చేసిన ప్రయోగంలో వాటి పాత కణాలను రిఫ్రెష్ చేసేందుకు ప్రయత్నించారు. 'ఇన్ వివో పార్షియల్ రిప్రోగ్రామింగ్‌' ప్రక్రియ ఎలుకల్లో శారీరక వృద్ధాప్యం సమయంలో వయసు-సంబంధిత పరమాణువుల్లో కలిగే మార్పులను అడ్డుకుందని కనుగొన్నారు. కాగా ఈ పద్ధతి వృద్ధాప్యాన్ని సమర్థవంతంగా, సురక్షితంగా ఎలుకల్లోని కణాలను పాక్షికంగా పునరుద్ధరించగలిగిందని రుజువైంది.


ఈ అధ్యయనంలో కీలకమైన యమనకా ఫ్యాక్టర్స్.. నాలుగు రీప్రోగ్రామింగ్ అణువుల సమితిగా ఉంటాయి. ఇవి శరీర కణాల్లో కనిపించే పరమాణు గడియారాన్ని రీసెట్ చేయగలవు. వృద్ధాప్యం ద్వారా పరిణామం చెందే రసాయనాల(ఎపిజెనెటిక్ మార్కర్స్) ప్రత్యేకమైన నమూనాలను వాటి అసలు స్థితికి తిరిగి తీసుకురావడం ద్వారా యవ్వనంగా మార్చగలవు. వయోజన కణాలను తిరిగి మూలకణాలుగా మార్చడానికి ఈ విధానం ఉపయోగించబడింది. ఆరోగ్యకరమైన జంతువులు జీవితంలో చివరి దశలకు చేరుకున్నప్పుడు వాటిపై ప్రభావాలను పరిశోధించడమే ఈ కొత్త అధ్యయన ఉద్దేశ్యం.

Advertisement

Next Story

Most Viewed