ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం..?

by Satheesh |   ( Updated:2022-03-09 14:00:05.0  )
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం..?
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ 15వ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనితో అన్ని జట్లు ఆటగాళ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మెగా వేలంలో కోట్లు కుమ్మరించి తీసుకున్న కీలక ఆటగాళ్లు లీగ్‌ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజ్‌లకు షాక్ ఇస్తున్నారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను చైన్నై రూ. 14కోట్లకు కొనుగోలు చేసిన.. అతడు గాయంతో ఐపీఎల్ సగం సీజన్‌కు దూరం అయిన విషయం విధితమే. అయితే, తాజాగా మరో కీలక ఆటగాడు ఐపీఎల్‌కు దూరం అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సౌతాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జేను 6.5కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అయితే, నోర్జే ఇటీవల ఓ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. ఈ విషయమై సౌతాఫ్రికా బోర్డ్‌తో చర్చించాలని బీసీసీఐను ఢిల్లీ క్యాపిటల్స్ యజమాన్యం కోరింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story