Ananya Nagalla : హైదరాబాదు బస్టాండ్‌లో చలితో వణుకుతోన్న పేదలకు అనన్య నాగళ్ల సాయం (వీడియో)

by Anjali |   ( Updated:2024-11-15 15:43:21.0  )
Ananya Nagalla : హైదరాబాదు బస్టాండ్‌లో చలితో వణుకుతోన్న పేదలకు అనన్య నాగళ్ల సాయం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) వకీల్ సాబ్(Pawan Kalyan) చిత్రంలో కీలక పాత్ర పోషించి.. ప్రేక్షకుల మన్ననలు పొందింది హీరోయిన్ అనన్య నాగళ్ల(Ananya Nagalla). ప్రస్తుతం ఈ అమ్మడు డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా పొట్టేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తాజా చిత్రంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది.

ఈ అమ్మడుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా నిన్న (నవంబరు 11) చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఓ వైపు సినిమాల్లో తన సత్తా చాటుతూనే మరోవైపు అనన్య హెల్పింగ్ నేచర్‌తో గొప్పమనసు చాటుకుంటోంది. ఇటీవల ఏపీలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరగ్గా.. ఎంతో మంది సెలబ్రిటీలు తమవంతు సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోయిన్ అనన్య కూడా ముందుకొచ్చి వరద బాధితులకు రూ. 2. 5 లక్షల విరాళం ప్రకటించింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ బ్యూటీ 5 లక్షల రూపాయల సాయం అందించింది. తాజాగా అనన్య అర్థరాత్రి హైదరాబాదు(Hyderabad) బస్టాండ్‌ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పి మరోసారి గొప్పమనసు చాటుకుంది. చలికాలం స్టార్ట్ అవ్వడంతో ఈ హీరోయిన్ బస్టాండ్ లో ఉన్న పలువురి ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తనే చేతితో దుప్పట్లు కప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు మరోసారి అనన్య నాగళ్లను పొగుతున్నారు.


👉 Click Here For Tweet!



Advertisement

Next Story