Ananya Nagalla: ఇకపై నన్ను ఆ పేరుతోనే పిలుస్తారు.. యంగ్ బ్యూటీ వైరల్ కామెంట్స్

by sudharani |
Ananya Nagalla: ఇకపై నన్ను ఆ పేరుతోనే పిలుస్తారు.. యంగ్ బ్యూటీ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్'పై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక భారీ అంచనాల మధ్య ‘పొట్టేల్’ మూవీ అక్టోబర్ (October) 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ (Promotions) లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న అనన్య.. సినిమాపై ఆసక్తికర కామెంట్స్ (comments) చేసింది.

‘‘పొట్టేల్’ సినిమా చాలా అద్భుతం (wonderful)గా వచ్చింది. ఇది ఓ పాప చుదువు చుట్టూ అల్లుకున్న కథ ఇది. అంతే కాదు.. ఇందులో ట్రైలర్ (Trailer) లో కనిపించని చాలా కోణాలు దాగి ఉంటాయి. అందుకే స్క్రిప్ట్ (script) విన్నాక కచ్చితంగా దీంట్లో భాగం కావాలని అనుకున్నా. ఈ సినిమాలో నేను బుజ్జమ్మగా కనిపిస్తా. ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రైలర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో నా పాత్రను చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు నన్ను ‘మల్లెశం’ అనన్య, ‘వకీల్‌సాబ్’ అనన్య అని పిలిచేవారు. కానీ ఈ సినిమా రిలీజైన తర్వాత బుజ్జమ్మ (Bujjamma) అనన్య అని పిలుస్తారు. ఈ సినిమాలో నా పాత్ర అంతా పవర్ ఫుల్‌గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed