- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: ఆరంభం అదుర్స్..! రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వరల్డ్ బ్యాంక్ (World Bank) గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రూ.6,750 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంక్ పాలకవర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే రూ.6 ,850 కోట్లు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. విడతలు వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. హడ్కో (HUDCO) నుంచి జర్మన్ బ్యాంక్‌తో కలిపి మరో రూ.16 వేల కోట్లు రుణంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హడ్కో పనులకు వెంటనే ప్రభుత్వం టెండర్లకు పిలవనుంది. సంక్రాంతి (Sankranthi తరువాత పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
కాగా, ఇప్పటికే సీఎం చంద్రబాబు (CM Chandrababu) రాజధాని నిర్మాణంపై అధికారులకు రోడ్ మ్యాప్ ఇచ్చామని ఇటీవలే పేర్కొన్నారు. గడిచిన మూడు నెలల్లో ధ్వంసమైన పరిస్థితులను గాడిన పెట్టగలిగామని తెలిపారు. రాజధాని పునర్నిర్మాణంపై ఇంజినీర్లు ఐఐటీ చెన్నై (IIT Chennai), హైదరాబాద్ (Hyderabad) నిపుణులతో అధ్యయనం చేయించి ఓ రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికిప్పుడు కొత్త పనులను చేపట్టేందుకు వీలుగా పూర్తి కార్యాచరణను సిద్ధం చేశామని సీఎం ఇటీవలే వెల్లడించారు.