వారు ఆ భాషలో మాట్లాడాలి.. దుమారం రేపిన అమిత్ షా వ్యాఖ్యలు

by Harish |
వారు ఆ భాషలో మాట్లాడాలి.. దుమారం రేపిన అమిత్ షా వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. వేర్వేరు రాష్ట్రాల వారు కలిసినపుడు ఇంగ్లీష్ లో కాకుండా, హిందీలో సంభాషించుకోవాలని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలు చేశారు. హిందీ జాతీయ భాష కాదని అన్నారు. బీజేపీ సంస్కృతిక ఉగ్రవాదానికి తెరలేపుతుందని ఆరోపించారు. అంతకుముందు రోజు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటరీ అధికారిక భాష కమిటీ 37 సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని నడిపించడానికి మాధ్యమం అధికార భాషేనని నిర్ణయించారు. దీని ద్వారా హిందీ ఆవశ్యకత మరింత పెరుగుతుంది. దేశాన్ని ఏకం చేయడంలో అధికారిక భాష ముఖ్యమైన పాత్ర పోషించే సమయం వచ్చింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు, అది భారతీయ భాషలోనే జరగాలి అని అన్నారు. హిందీని ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా స్వీకరించాలని, స్థానిక భాషలకు కాదని చెప్పారు. ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మారుస్తామని అన్నారు. కాగా గతంలో అధికార భాష విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed