- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah: ఎంపీ అర్వింద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్.. దాడిపై ఆరా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: Amit Shah Called MP Arvind to Enquiry about attack in Erdandi Village| నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందని తెలియగానే శుక్రవారం ఆయన స్వయంగా ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షాకు ఎంపీ అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు.. పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగినా దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఎర్ధండిలో తనపై జరిగిన దాడి వెనక కోరుట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని హోంమంత్రికి అర్వింద్ వివరించారు.
ఇది కూడా చదవండి: 'నాపై దాడి చేయించింది ఆ ఎమ్మెల్యేనే'.. ఎర్దండి ఎటాక్‌పై ఎంపీ అరవింద్ ఫైర్