- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 ఏళ్లకే రిటైర్మెంట్.. ఈ ప్రయాణం చాలంటున్న క్రీడాకారిణి..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా క్రీడాకారులు తాము మధ్య వయసుకు వచ్చిన సమయంలో తమ క్రీడకు వీడ్కోలు చెబుతూ తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారు. మరికొందరు అనివార్య కారణాల వల్ల తప్పుకుంటారు. కానీ యూఎస్‌కు చెందిన ఐస్ స్కేటర్ అలైసా లియు మాత్రం 16 ఏళ్లకే తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతక విజేతగా నిలిచింది. దాంతో పాటుగా యూఎస్ ఛాంపియన్‌గా రెండు సార్లు గెలిచింది. కానీ స్కేటింగ్‌లో తనదైన ప్రతిభతో విశేష గుర్తింపు తెచ్చుకున్న అలైస నిర్ణయం అభిమానులు షాక్‌కు గురిచేసింది. అయితే తన రిటైర్‌మెంట్ విషయంలో ఎటువంటి బాధ లేదని ఆమె తెలిపింది.
అంతేకాకుండా ఈ ప్రయాణం ఇక చాలని, గత 11 ఏళ్లుగా ఐస్‌పై ప్రయాణిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. 'నేను నా 5 ఏళ్ల వయసులో స్కేటింగ్ ప్రారంభించాను. ఇప్పటికి నేను స్కేటింగ్ మొదలు పెట్టి 11 ఏళ్లు అయ్యాయి. ఈ 11 ఏళ్లు నా జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించాయి' అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా తన స్కేటింగ్ కెరీర్‌లో తాను ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని అలైసా తెలిపింది.