- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్డెక్కిన మొసలి.. అందర్నీ చూసి, ఇలా చేసింది (వీడియో)

దిశ, వెబ్‌సైట్ః అడవి మృగాలు జనావాసంలోకి వస్తే కంగారు పడటం కామన్. వాటి కంగారు సంగతి అలా ఉంచితే, అవి తమను ఏమైనా చేస్తాయని మనుషులు అంతకంటే ఎక్కువ భయపడతారు. ఏదేమైనా, వైల్డ్ లైఫ్‌లో కింగ్‌లా బతికే కొన్ని మృగాలు ఎక్కడున్నా అలాగే ఉండాలనుకుంటాయి. నీటిలో రాజులా బతికే ఈ మొసలి కూడా అంతే.. ఫ్లోరిడాలో సరిగ్గా ఇదే జరిగింది. రద్దీగా ఉండే రహదారిపైకి వచ్చిన ఓ పాదం లేని మొసలి హుందాగా రోడ్డు దాటుతూ కనిపించింది. ఫ్లోరిడాలోని వెనిస్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
రోడ్డుకు ఇవతల కారు ట్రక్కులో ఉన్న డేనియల్ కౌఫ్‌మన్ అనే వ్యక్తి దీన్ని రికార్డ్ చేశాడు. దాదాపు 10 అడుగుల వరకూ ఉన్న ఈ ఎలిగేటర్ డేనియల్ కారు కింద నుండి వెళ్తుంటే అతను చాలా కంగారు పడ్డాడు. అంతేనా, ఆ భారీ మొసలి కారు కింద నుండి వెళ్లుంటే కారు కూడా కదలడం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియోను చాలా మంది షేర్ చేయగా, ఫ్లోరిడాలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమయ్యాయంటూ కొందరు కామెంట్ చేశారు.