- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన కేటీఆర్
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు. గురువారం కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన్ని కలిసిన జర్నలిస్టులకు ఈ మేరకు హామీ ఇచ్చారు. కరీంనగర్ జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇస్తామని వెల్లడించారు. టీయూడబ్ల్యూజే- ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన జర్నలిస్టులు సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి నివేశన స్థలాల సమస్య తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలు తీరుస్తామని అసెంబ్లీలో ప్రకటించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌కు టీయూడబ్ల్యూజే నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జె.మారుతిస్వామి, కోశాధికారి తాండ్ర శరత్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ మహేంద్ర చారి, ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొయ్యడా చంద్రశేఖర్, ఉరేడి రవీందర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి గుండేటి సతీష్, వీడియో జర్నలిస్ట్ అధ్యక్ష కార్యదర్శిలు డి.సంపత్, బి.ప్రేమ సాగర్, ఎండి షూకూర్, సుధీర్, మహిధర్ తదితరులు పాల్గొన్నారు.