- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా క్రికెట్ టోర్నీలో కలకత్తా బ్లాస్టర్ విజయం
దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆల్ ఇండియా మహిళల టీ20 క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ మేరకు ఈ పోటీలు బుధవారం నాలుగో రోజుకు చేరగా.. డే అండ్ నైట్ లీగ్ మ్యాచ్ ఇప్పటి వరకు వరుసగా రెండు విజయాలు సాధించిన తెలంగాణ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. కాగా ఉదయం జరిగిన మ్యాచ్ కలకత్తా బ్లాస్టర్, కాశ్మీర్ క్విన్ జట్లు తలపడగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కాశ్మీర్ క్వీన్ జట్టు పరిమిత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జట్టుకు చెందిన ఖుషి 26 బంతుల్లో 24 పరుగులు, సుచిత 16 బంతుల్లో 12 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన కలకత్తా బ్లాస్టర్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఒక వికెట్ నష్టంతో 85 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇటిషా నిలిచింది. ఈ పోటీలను ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం.డీ. మతిన్, విజయ్, డాక్టర్ వి.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.