- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గురుడిపై గ్రహాంతర వాసులు?
దిశ, ఫీచర్స్: అనంత విశ్వంలోని గ్రహాల గుట్టును ఛేదిస్తున్నప్పటికీ గ్రహాంతర వాసుల విషయంలో మాత్రం ఓ కన్‌క్లూజన్‌కు రాలేకపోతున్నాం. అందుకుతగ్గ శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి అనేకమంది శాస్త్రవేత్తలు తమ తమ అభిప్రాయాలు, సిద్ధాంతాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బృహస్పతికి చెందిన అనేక చంద్ర గ్రహాల్లో ఒకదానిపై గ్రహాంతర జీవుల ఉనికిని అన్వేషిస్తున్న పరిశోధకులు.. ఈ విషయంలో కొంత పురోగతి సాధించారు.
గురుగ్రహానికి గల 79 చంద్రుల్లో యూరోపా ఒకటి. ఇది గ్రహాంతర జీవులకు ఆతిథ్యమిస్తుందని చాలా కాలంగా విశ్వసిస్తున్న పరిశోధకులు.. తాజాగా అందుకు బలం చేకూర్చే అంశాలను గుర్తించారు. జీవరాశికి అవసరమైన నీరు, ఆక్సిజన్‌తో పాటు పోషకాలుగా ఉపయోగపడే రసాయనాలు అక్కడ పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఇప్పటివరకు పరిశీలనపైనే ఆధారపడ్డ పరిశోధకులు ఇప్పుడు దీన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి యూరోపా మంచుతో నిండిన ప్రపంచం. 24 కిలోమీటర్ల మందంతో మంచుతో కప్పబడి మహాసముద్రాలకు నిలయంగా ఉంది. ఒక వేళ ఈ ప్రాంతంలో జీవముంటే ఆ ఫలకాల కింద ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మందపాటి మంచులోఉన్న జీవులకు ప్రాణవాయువు ఎలా చేరుకుంటుందన్న విషయంలో స్పష్టత లేకపోగా.. వెళ్లే అవకాశముందని నిరూపించేందుకు ఓ నమూనాను రూపొందించారు. ఈ మేరకు యూరోపా మంచు షెల్ కిందున్న ఉప్పునీరు ఆక్సిజన్‌ను రవాణా చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
నాసా 2024లో 'యూరోపా క్లిప్పర్' అనే ఆర్బిటార్‌ను పంపాలని యోచిస్తోంది. శాస్త్రవేత్తల ప్రస్తుత పరిశోధనల ఆధారంగా ఇది రూపొందించబడుతుందని, మార్స్ కంటే యూరోపాలోనే గ్రహాంతర జీవులను కనుగొనేందుకు అవకాశం ఉందని ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మార్క్ హెస్సే పేర్కొన్నాడు.