Alia - Ranbir Marriage: ఆలియా ఫ్యాన్స్‌కు షాక్.. మరోసారి వాయిదా పడిన మ్యారేజ్

by samatah |   ( Updated:2022-04-12 08:58:38.0  )
Alia - Ranbir Marriage: ఆలియా ఫ్యాన్స్‌కు షాక్.. మరోసారి వాయిదా పడిన మ్యారేజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్‌లో ఆలియా, రణ్ బీర్ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రేమ పావురాలు ఒక్కటవుతుండటంతో వారి అభిమానుల ఆనందం అంతా ఇంతాకాదు. అయితే ఎప్పుడెప్పుడు వీరి వివాహ సెలబ్రెషన్స్ చూడాలా అని ఆరాటపడుతున్న ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్ తగిలింది. మరోసారి ఆలియా రణబీర్ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 14న వీరి పెళ్లి జరగనుంది. కానీ సెక్యురిటీ దృష్ట్యా వీరి పెళ్లి వచ్చేవారాని పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. భద్రతాపరమైన కారణాల వలన మెహందీ, హల్దీ సహా అన్ని వేడుకల తేదీల్లో మార్పులు చేశారు. అందువలన పెళ్ళి కూడా వచ్చేవారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటున్నారు.

Advertisement

Next Story