- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కినేని నాగచైతన్య-శోభిత పెళ్లి.. చర్చనీయాంశంగా మారిన అమల పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన వీరిద్దరు ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకుని తమ రిలేషన్‌షిప్‌ను బయటపెట్టారు. వీరి నిశ్చితార్థం గురించి స్వయంగా నాగార్జున ట్విట్టర్‌లో ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. అయితే చైతు, శోభిత(Sobhita Dhulipala) పెళ్లి డిసెంబర్ 4వ తేదీన జరగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి.
ఇక అక్కినేని అభిమానులంతా వీరి పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున తన చిన్న అక్కినేని అఖిల్(Akkineni Akhil) నిశ్చితార్థం జైనబ్(Zainab)తో జరిగినట్లు వెల్లడించారు. దీంతో అక్కినేని వారసుల పెళ్లి ఒకేచోట జరతుందని అంతా భావించారు. కానీ దీనిపై నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, అమల(Amala) పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పెళ్లి జరుగుతున్న వేళ అమల విమర్శలు ఎదుర్కొంటుంది.
దానికి కారణం ఏంటంటే.. ఇటీవల నాగచైతన్య ఎంగేజ్‌మెంట్(Engagement) గురించి ఎలాంటి పోస్ట్ పెట్టని అమల తన కుమారుడు అఖిల్ నిశ్చితార్థం ఫొటోలను పోస్ట్ చేసి కామెంట్ సెక్షన్‌ను మాత్రం ఆఫ్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో పలు చర్చలు మొదలయ్యాయి. నాగచైతన్య విషయంలో ఆమె సవతి తల్లి లాగానే వ్యవహరిస్తుందని చర్చించుకుంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ అమల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More...
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నాగ చైతన్య, శోభితల హల్దీ ఫంక్షన్ స్టార్ట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో