Aishwarya Rai: పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్.. సంచలన విషయం వెలుగులోకి?

by Kavitha |   ( Updated:2024-11-04 04:40:18.0  )
Aishwarya Rai: పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్.. సంచలన విషయం వెలుగులోకి?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నది. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్‌బి అమితాబ్ బచ్చన్(Amitab Bachchan) తనయుడు అయిన అభిషేక్ బచ్చన్‌(Abhshek Bachchan)తో ప్రేమలో పడి 2007లో పెళ్లి కూడా చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య(2011)(Aaradhya) అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ స్టార్ కపుల్ విడాకులు(Divorce) తీసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికారు చేస్తోంది. దీనికి తోడు ఐశ్వర్య ఎక్కడికి వెళ్లిన తన పాపతో కలిసి వెళ్లడం, పక్కనే భర్త లేకపోవడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఈ విషయం పై ఇప్పటి వరకు ఇటు ఐష్ కానీ అటు అభిషేక్ కానీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు బ్రేక్ పడినట్టు అయింది. ఈ క్రమంలో ఐష్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట దుమారం రేపుతోంది. పెళ్లికి ముందే ఐశ్వర్యకు కొడుకు ఉన్నాడనే వార్త సంచలనంగా మారుతోంది.

ఐశ్వర్యరాయ్ కొడుకుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. సంగీత్ కుమార్(Sangeeth Kumar) అనే వ్యక్తి.. తాను ఐశ్వర్యరాయ్ కొడుకునని చెబుతున్న వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అయితే ఇది నాలుగేళ్ల క్రితం వీడియో కాగా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. తాను లండన్‌లోని ‘IVF- ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’(IVF- In Vitro Fertilization) ద్వారా పుట్టానని సంగీత్ తెలియజేశాడు. అలాగే తన తల్లి ఐశ్వర్యరాయ్ అని, లండన్‌లో పుట్టిన తనను తల్లిదండ్రులు విశాఖపట్నం(Visakhapatnam) తీసుకొచ్చారని చెబుతున్నాడు. తనను ఐష్ తల్లిదండ్రులు పెంచారని, తన పుట్టుకకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అతనెవరు.. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే విషయంపై ఆరా తీస్తే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు విడాకుల వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed