- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Agnipath Scheme: ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపథ్‌కు అభ్యర్థుల వెల్లువ
న్యూఢిల్లీ: Air Force Receives 94,281 Applications Under Agnipath Scheme In 4 days| భారత వాయు దళం చేపట్టిన అగ్నివీరుల నియామక ప్రక్రియకు రోజురోజుకు స్పందన పెరుగుతుంది. శుక్రవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, నాలుగు రోజుల వ్యవధిలోనే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య లక్షకు చేరువైంది. సోమవారం వరకు దేశవ్యాప్తంగా 94,281 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం వరకు 94,281 మంది అగ్నివీర్ వాయు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూలై 5తో దరఖాస్తు గడువు ముగుస్తుంది' అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు 56,960 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 24 గంటల వ్యవధిలోనే 40వేల వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. త్రివిధ దళాల్లో ఈ ఏడాదికి గానూ 46వేల అగ్నివీరుల నియమాకాలు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే వాయుసేన రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా, ఆర్మీ, నావీ త్వరలోనే ప్రారంభించనున్నారు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త: DRDOలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Tags
- Agnipath Scheme