మోడీ, నితీష్‌లకు పిల్లలు కలగాలి: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు

by Disha Desk |
మోడీ, నితీష్‌లకు పిల్లలు కలగాలి: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు
X

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదమన్న మోడీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 'మోడీకి పిల్లలు లేరు. నితీష్‌కు కుమారుడు ఉన్నప్పటికీ రాజకీయాలకు సరిపోలేదు. వారిద్దరి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగల పిల్లలతో వారు ఆశీర్వదించబడాలని మాత్రమే ప్రార్థించగలం' అని లాలూ ప్రసాద్ యాదవ్ జాతీయ మీడియాతో తెలిపారు. ఆర్జేడీ చీఫ్‌గా బీహార్ రాజకీయాలను కొంత కాలం పాటు లాలూ శాసించారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం కాగా, వారిలో తేజస్వీ యాదవ్ 2015లో కొంతకాలం బీహార్ డిప్యూటీ సీఎం‌గా ఉన్నారు. అంతకుముందు రాజ్యసభలో ప్రధాని మోడీ కుటుంబ పార్టీలపై విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పై ఆయన విరుచుకుపడ్డారు. అయితే నితీష్ కుమార్ మాత్రం తన కుమారుడిని రాజకీయాలకు దూరంగా ఉంచారంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story