క్రిప్టోకరెన్సీ యాడ్స్‌లో 'డిస్‌క్లెయిమర్' తప్పనిసరి చేసిన అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్!

by Web Desk |
క్రిప్టోకరెన్సీ యాడ్స్‌లో డిస్‌క్లెయిమర్ తప్పనిసరి చేసిన అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీలకు సంబంధించి వచ్చే యాడ్స్‌లో ఇకపై 'హెచ్చరిక' తప్పనిసరిగా ఉండాలని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలవుతుందని, క్రిప్టోకరెన్సీ, ఎన్ఎఫ్‌టీలకు చెందిన పథకాలు, ప్రోడక్ట్‌ల గురించి వచ్చే అన్ని యాడ్స్‌లో ఖచ్చితంగా ఈ హెచ్చరిక(డిస్‌క్లెయిమర్) ఉండి తీరాలని ఏఎస్‌సీఐ స్పష్టం చేసింది.

'ఇప్పటి వరకూ ఈ డిజిటల్ కరెన్సీలకు ఎటువంటి నియంత్రణ లేదు. కాబట్టి నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా క్రిప్టో, ఎన్ఎఫ్‌టీ లావాదేవీల్లో నష్టపోతే పరిష్కారానికి తగిన ప్రక్రియ కూడా లేదు' అనేలా డిస్‌క్లెయిమర్ ఉండాలని ఏఎస్‌సీఐ పేర్కొంది. ఈ హెచ్చరిక ప్రింట్ మీడియాలో అయితే ఐదో వంతుగా ఉండాలని, చిన్న చిన్న వీడియో యాడ్స్ అయితే 5 సెకన్లు, పెద్ద వీడియోల్లో అయితే మొదట్లో, చివర్లోనూ తప్పనిసరి దీన్ని చూపించాలని తెలిపింది.

ముఖ్యంగా సోషల్ మీడియా పోస్ట్‌లైనా, ఆడియోలైనా, తక్కువ సమయంలో కనిపించే వాటిలోనైనా సరే తప్పనిసరిగా డిస్‌క్లెయిమర్ ఉండి తీరాల్సిందేనని వెల్లడించింది. అలాగే, యాడ్స్‌లో కరెన్సీ, సెక్యూరిటీ, డిపాజిటరీస్, కస్టోడియన్ పదాలను వాడకూడదు. ఇదివరకు వీటిపై వచ్చిన రాబడి, గడిచిన ఏడాది కంటే తక్కువ సమయంలో వచ్చిన లాభాలను యాడ్స్‌లో చూపించకూడదని ఏఎస్‌సీఐ ఆదేశాలిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed