డబ్బుల కోసమే నన్ను వేధిస్తున్నాడు.. చీటింగ్‌ కేసుపై స్పందించిన సోనాక్షి

by Manoj |   ( Updated:2022-03-09 07:56:14.0  )
డబ్బుల కోసమే నన్ను వేధిస్తున్నాడు.. చీటింగ్‌ కేసుపై స్పందించిన సోనాక్షి
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇటీవల ఓ చీటింగ్‌ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కాగా నాన్‌ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ కూడా జారీ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఈ న్యూస్‌పై స్పందించిన సోనాక్షి.. తనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.'నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. కొందరు నాపై కావాలనే అసత్యపు ప్రచారం చేస్తున్నారు. దీనిపై నా స్టేట్‌మెంట్‌ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర పన్నుతున్నాడు. కాబట్టి అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు' అంటూ రిక్వెస్ట్ చేసింది. అలాగే సదరు వ్యక్తి తన పేరు చెడగొట్టి, డబ్బు రాబట్టేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడన్న నటి.. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ అంశంపై మాట్లాడకపోవడమే మంచిదని తెలిపింది.

Advertisement

Next Story