నిద్ర ఉండట్లేదు.. అయినా చేయక తప్పట్లేదు!

by Javid Pasha |   ( Updated:2022-03-27 08:56:02.0  )
నిద్ర ఉండట్లేదు.. అయినా చేయక తప్పట్లేదు!
X

దిశ, సినిమా : అందాల తార రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. తాజాగా 'యోధ' మూవీ షూటింగ్‌‌లో పాల్గొన్న ఆమె.. ఓ చానెల్‌తో మాట్లాడుతూ పది నిమిషాలు కూడా ఫ్రీ టైమ్ దొరకట్లేదంటూ చెప్పుకొచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న 'యోధ' షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడానికి ముందు తమిళ చిత్రం 'సర్దార్‌' నైట్ షూట్‌లో పాల్గొన్నానని, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చినట్లు తెలిపింది.

వరుస షెడ్యూల్స్‌ కారణంగా నిద్రపోయేంత టైమ్ కూడా ఉండట్లేదన్న రాశి.. ఆర్టిస్ట్‌ లైఫ్‌ కాస్త కష్టమే అయినప్పటికీ ఇష్టంగానే భావిస్తానని చెప్పింది. ఇక దర్శక ద్వయం సాగర్-పుష్కర్‌ తెరకెక్కిస్తున్న 'యోధ' చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. బాలీవుడ్ ఏస్ ఫిల్మ్ మేకర్ కరణ్‌ జోహార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా 2022 నవంబరులో రిలీజ్‌ కాబోతుంది.

Advertisement

Next Story