- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెషీన్‌లో నా హ్యాండ్ ఇరుక్కుందంటూ నటి ఎమోషనల్ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్
దిశ, సినిమా: తమిళ సీరియల్ యాక్టర్ సాయి గాయత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పాండియన్స్ స్టోర్స్’, ‘నీ నాన్ కాదల్’ వంటి ధారావాహికలు ఈ భామకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టాయి. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా ఈమె ఓ వైపు సిరీయల్స్‌లో నటిస్తూనే మరోవైపు బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. అలా గతేడాది ‘సాయి సీక్రేట్స్’ అనే పేరుతో ఓ కంపెనీను రన్ చేస్తూ.. సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ప్రొడక్ట్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన విషయాల గురించి షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా సాయి గాయత్రి తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘అనుకోకుండా ఓ యంత్రంలో నా చెయ్యి ఇరుక్కుంది. దీంతో నా కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. నేను 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.