మరణాన్ని అంచనా వేసే 'వన్-లెగ్డ్ స్టాన్స్' టెస్ట్!

by Manoj |
మరణాన్ని అంచనా వేసే వన్-లెగ్డ్ స్టాన్స్ టెస్ట్!
X

దిశ, ఫీచర్స్ : వయస్సుతో పాటు 'హ్యూమన్ బ్యాలెన్స్' కూడా క్షీణిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సామర్థ్యం వ్యాధి, మరణాల ప్రమాదానికి సూచికగా ఉపయోగపడుతుందా? లేదా? అనే విషయం గురించి తెలుసుకునేందుకు అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ అధ్యయనం చేసింది. ఈ మేరకు10సెకన్ల వన్-లెగ్డ్ స్టాన్స్ పరీక్షను పూర్తి చేయలేని వారిలో అసమాన మరణాల రేటును కనుగొంది. ఇలాంటి పరీక్ష సాధారణ ఆరోగ్య తనిఖీలలో భాగంగా మారవచ్చని పరిశోధకులు సూచించారు.

రాబోయే దశాబ్దంలో ఒక వ్యక్తి మరణ ప్రమాదాన్ని అంచనా వేసేందుకు సమతుల్యతను ఉపయోగించవచ్చో లేదో నిర్ణయించేందుకు పరిశోధకులు ఈ కొత్త అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల కోసం వాళ్లు దాదాపు 1,702 సబ్జెక్టుల డేటాను పరిశీలించారు. ఈ మేరకు శరీర బరువు, స్కిన్‌ఫోల్డ్ కొలతలు, నడుము పరిమాణం, మెడికల్ హిస్టరీ వంటి కొలమానాలను విశ్లేషించారు. కాగా ఎముక సాంద్రత క్షీణించడం, శారీరక బలం కోల్పోవడం, శరీర స్థానం, చుట్టూ ఉన్న వాతావరణం వంటి ఫ్యాక్టర్స్‌పై 'హ్యూమన్ బ్యాలెన్స్' క్షీణత ఆధారపడి ఉంటుందని, వయసు మీరుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి మందగించడం, కీళ్ళు అరిగిపోవడం, కంటి చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని పరిశోధకులు వెల్లడించారు. చెవి ఇన్ఫెక్షన్లు, స్ట్రోక్, మల్టిపుల్ స్క్లెరోసిస్‌ సహా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా పేలవమైన బ్యాలెన్స్ సూచనగా చెప్పవచ్చన్నారు.

బ్యాలెన్స్ పరీక్ష ఫలితాల ప్రకారం బ్యాలెన్స్ టెస్ట్ విఫలమైన వారిలో మరణాల రేటు గణనీయంగా ఎక్కువగా ఉందని తేల్చారు. పరీక్షలో విఫలమైన వారు సాధారణంగా ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అంతేకాదు వీళ్లలో టైప్ 2 డయాబెటిస్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు.

'ఈ అంశంపై మరింత లోతైన పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ మేరకు హ్యూమన్ బ్యాలెన్స్ కారణంగా మరణ ప్రమాదం గురించి కచ్చితమైన ప్రకటనలు చేయడం కష్టం. ప్రత్యేకించి ఒంటి కాలు మీద నిలబడటం లేదా సాధారణంగా సమతుల్యం చేయడం అనేది శిక్షణ, అభ్యాసం ద్వారా మెరుగుపరచగలరని భావించినప్పుడు, వివిధ యోగా భంగిమలను ప్రయత్నించే వ్యక్తులు ఈజీగా చేస్తారు. అయినప్పటికీ బ్లడ్‌ప్రెజర్ రీడింగ్ లేదా రక్త పరీక్ష వంటి సాధారణ వ్యాధి ప్రమాదం గురించి సాధారణ చిత్రాన్ని రూపొందించేందుకు వైద్యులు దీన్ని ఉపయోగించవచ్చని మా పరిశోధన సూచిస్తుంది. ఐదు దశాబ్దాలుగా బ్యాలెన్స్‌ను అంచనా వేసేందుకు ఎంతోమంది వైద్యులు వన్-లెగ్డ్ స్టాన్స్ టెస్ట్ ఉపయోగిస్తున్నారు' అని పరిశోధకులు బృందం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed